'పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి రాలేదు' | New PCC president for Telangana! | Sakshi
Sakshi News home page

'పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి రాలేదు'

Aug 6 2014 12:50 PM | Updated on Aug 14 2018 3:55 PM

'పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి రాలేదు' - Sakshi

'పదవి కాపాడుకోవడానికి ఢిల్లీకి రాలేదు'

అధ్యక్ష పదవి నుంచి తప్పించనున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేశారు.

న్యూఢిల్లీ : అధ్యక్ష పదవి నుంచి తప్పించనున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ పీసీసీ  అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేశారు. తాను పదవి చేపట్టిన నుంచి తప్పిస్తారని చెప్తూనే ఉన్నారని, అవన్నీ ఊహాగానాలేనని ఆయన బుధవారమిక్కడ అన్నారు. పదవిని కాపాడుకోవటానికి తాను ఢిల్లీ రాలేదని, మేథోమథనం సదస్సుపై చర్చించేందుకే వచ్చినట్లు పొన్నాల తెలిపారు. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు రావటం మామూలేనని ఆయన అన్నారు.

మరోవైపు పొన్నాలను తప్పించి వేరొకరికి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నందున ఆ పదవిని ఆశిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు సీఎల్పీ నేత కె.జానారెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు.

 

టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో జానారెడ్డి అభిప్రాయాలను తెలుసుకునేందుకే ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దిగ్విజయ్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా జానారెడ్డి కలిసే అవకాశాలున్నాయి. మరోవైపు ఆ పదవిని ఆశిస్తున్న శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ  జానారెడ్డితోపాటే ఢిల్లీ వెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement