కేసీఆర్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ | Mudragada Padmanabham Letter to telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ

Apr 17 2017 9:46 AM | Updated on Oct 19 2018 6:51 PM

కేసీఆర్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ - Sakshi

కేసీఆర్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల మేనిఫెస్టో చిత్తు కాగితం కాదని రుజువు చేశారంటూ కేసీఆర్‌ను ముద్రగడ అభినందించారు.  ముస్లింలు, ఎస్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

పదవులు, ఆస్తులు  శాశ్వతం కాదని, మాట నిలబెట్టుకోవడం ముఖ్యమన్నారు. డబ్బు ఖర్చుల్లేని ఎన్నికలు నిర్వహించి మరింత మంచిపేరు తెచ్చుకోవాలని ముద్రగడ తన లేఖలో కేసీఆర్‌కు సూచించారు. కాగా ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ రాష్ట్ర కేబినెట్‌ ప్రవేశపెట్టిన బిల్లును తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement