హైకోర్టు విభజన చేపట్టాలి: ఎంపీ వినోద్ | mp vinod seeks bifurcation of high court | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజన చేపట్టాలి: ఎంపీ వినోద్

Jan 12 2015 4:46 PM | Updated on Mar 28 2019 5:32 PM

రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడకు తెలంగాణ ఎంపీ వినోద్ లేఖ రాశారు.

హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కరీంనగర్ ఎంపీ వినోద్ కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడకు ఓ లేఖ రాశారు.

హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలన్నారు. హైకోర్టు విభజన
చేపట్టక పోవటం వల్ల రెండు రాష్ట్రాలకు అనేక సమస్యలు వస్తాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement