పశువుల వద్దకే వైద్యం! | mobile veterinary services vehicles | Sakshi
Sakshi News home page

పశువుల వద్దకే వైద్యం!

Sep 15 2017 1:13 AM | Updated on Sep 19 2017 4:33 PM

పశువుల వద్దకే వైద్యం!

పశువుల వద్దకే వైద్యం!

పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతు లు

నేడు సీఎం చేతుల మీదుగా సంచార వైద్యశాలలు ప్రారంభం: తలసాని
సాక్షి, హైదరాబాద్‌:
పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతు లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంచార పశువైద్య సేవల వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. 100 సంచార పశువైద్య సేవల వాహనాలను శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. 1962 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఈ సంచార పశు వైద్యశా లలను సంప్రదించవచ్చని.. ఫోన్‌ చేసిన 30 నిమిషాల్లో రైతు వద్దకు చేరే విధంగా వాహ నాలను ఏర్పాటు చేశామని వివరించారు.

100 గ్రామీణ నియోజకవర్గాల్లో..
రాష్ట్రంలోని 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తలసాని వెల్లడించారు. ఒక్కో వాహనానికి అన్ని సౌకర్యాలతో కలుపుకొని రూ.14.65 లక్షల చొప్పున ఖర్చు చేసినట్లు వివరించారు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా ఈ వాహనంలో ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ సంచార పశు వైద్యశాలలను జీవీకే సంస్థ సహ కారంతో ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఉన్న ప్రదేశాన్ని సూచించేందుకు వీలు గా జీపీఎస్‌ పరిజ్ఞానాన్ని వాడుతున్నా మని వెల్లడించారు. ఈ కాల్‌ సెంటర్‌ అన్ని రోజుల్లో 24 గంటలు పనిచేస్తుందని, సెలవు దినాల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.

రూ.1,096 కోట్ల ఖర్చుతో గొర్రెల పంపిణీ..
జూన్‌ 20న ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధ వారం సాయంత్రం వరకు రూ.1,096 కోట్ల ఖర్చుతో 87,721 మంది లబ్ధిదారు లకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే మత్స్యకారుల అభివృద్ధికోసం రాష్ట్రంలోని 77 రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 20,391 గ్రామ పంచాయతీ చెరువులలో ఈసారి 70 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని తలసాని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement