Thalaassani Srinivasa Yadav
-
ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ర్యాలీకి అనుమతివ్వలేదనే అక్కసుతో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌పై లేనిపోని అభాండాలు మోపడం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఎంపీగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరైంది కాదని, శాంతిభద్రతల పరిరక్షణలో కమిషనర్ సేవలు ఎనలేనివని, హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన అధికారిని తూలనాడడం దురదృష్టకరమన్నారు. గతంలో కాంగ్రెస్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు అనుమతిచి్చంది కూడా ఈ అధికారే అనే విషయాన్ని ఉత్తమ్ మరచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుశాఖపై లేనిపోని ఆరోపణలు చేయడం ఉత్తమ్ లాంటి నాయకులకు తగదని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టు కుని మాట్లాడితే మంచిదని తలసాని హెచ్చరించారు. అనుమతిస్తే మంచి అధికారి, అనుమతించకుంటే అవినీతి అధికారి అంటూ గగ్గోలు పెట్టడం ఆయన చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్.. ప్రభుత్వ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం మంచిపద్ధతి కాదని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఎన్నడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకోసం మాట్లాడని ఉత్తమ్ నేడు ఎన్నికల్లో గెలవలేమనే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నారని అన్నారు. -
పశువుల వద్దకే వైద్యం!
నేడు సీఎం చేతుల మీదుగా సంచార వైద్యశాలలు ప్రారంభం: తలసాని సాక్షి, హైదరాబాద్: పశువుల అనారోగ్య సమస్యలు, వాటిని చికిత్సకు తరలించేందుకు రైతు లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంచార పశువైద్య సేవల వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. 100 సంచార పశువైద్య సేవల వాహనాలను శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. 1962 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ సంచార పశు వైద్యశా లలను సంప్రదించవచ్చని.. ఫోన్ చేసిన 30 నిమిషాల్లో రైతు వద్దకు చేరే విధంగా వాహ నాలను ఏర్పాటు చేశామని వివరించారు. 100 గ్రామీణ నియోజకవర్గాల్లో.. రాష్ట్రంలోని 100 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తలసాని వెల్లడించారు. ఒక్కో వాహనానికి అన్ని సౌకర్యాలతో కలుపుకొని రూ.14.65 లక్షల చొప్పున ఖర్చు చేసినట్లు వివరించారు. వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా ఈ వాహనంలో ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ సంచార పశు వైద్యశాలలను జీవీకే సంస్థ సహ కారంతో ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఉన్న ప్రదేశాన్ని సూచించేందుకు వీలు గా జీపీఎస్ పరిజ్ఞానాన్ని వాడుతున్నా మని వెల్లడించారు. ఈ కాల్ సెంటర్ అన్ని రోజుల్లో 24 గంటలు పనిచేస్తుందని, సెలవు దినాల్లో మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. రూ.1,096 కోట్ల ఖర్చుతో గొర్రెల పంపిణీ.. జూన్ 20న ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధ వారం సాయంత్రం వరకు రూ.1,096 కోట్ల ఖర్చుతో 87,721 మంది లబ్ధిదారు లకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే మత్స్యకారుల అభివృద్ధికోసం రాష్ట్రంలోని 77 రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 20,391 గ్రామ పంచాయతీ చెరువులలో ఈసారి 70 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని తలసాని పేర్కొన్నారు. -
పద్మభూషణ్‌కి విజయనిర్మలగారి పేరును ప్రతిపాదిస్తాం
– తలసాని శ్రీనివాస యాదవ్ ‘‘విజయనిర్మలగారు గొప్ప నటి. మంచి దర్శకురాలు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ ఆమె. విజయనిర్మలగారి పేరును పద్మభూషణ్ పురస్కారానికి ప్రభుత్వం తరపున సిఫార్సు చేయనున్నాం’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, దర్శకురాలు, నటి విజయ నిర్మలకు రాయల్ అకాడమీ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణ, విజయనిర్మలను శాలువాతో సత్కరించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేశ్, ఇతర సభ్యులు శ్రీకాంత్, వేణు మాధవ్, హేమ తదితరులు పాల్గొన్నారు.