కారెక్కిన కిషన్‌రెడ్డి | MLA mancireddy kishanreddy officially joined TRS | Sakshi
Sakshi News home page

కారెక్కిన కిషన్‌రెడ్డి

Apr 25 2015 12:40 AM | Updated on Oct 30 2018 4:40 PM

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరారు...

- సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం
- పరిమితస్థాయిలో నేతల చేరిక
- 4న ‘పట్నం’కు ముఖ్యమంత్రి
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి:
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో పరిమిత ప్రజాప్రతినిధులతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ అధ్యక్షుడు, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ముఖ్యనేతలు కారెక్కినవారిలో ఉన్నారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, హరీశ్వర్‌రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మే 4న ఇబ్రహీంపట్నంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల్లో మిగతాశ్రేణులు టీఆర్‌ఎస్‌లో చేరుతాయని కిషన్‌రెడ్డి వివరించారు.

ప్లీనరీకి భారీగా తరలిన నేతలు!
హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీకి జిల్లా నుంచి నాయకులు భారీగా తరలివెళ్లారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి నేతల ఎల్‌బీ స్టేడియానికి తరలివెళ్లడంతో శివార్లన్నీ గులాబీమయం అయ్యాయి. ఇటీవల పార్టీ పదవులు చేపట్టిన నాయకులు ప్రత్యేక వాహన శ్రేణుల్లో భారీగా అనుచరులతో ప్లీనరీ స్థలికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement