అస్తవ్యస్తంగా ’మిషన్‌ భగీరథ’ | Mission Bhagiratha Is Full Of Leakage | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా ’మిషన్‌ భగీరథ’

Mar 8 2019 2:49 PM | Updated on Mar 8 2019 2:50 PM

Mission Bhagiratha Is Full Of Leakage - Sakshi

గుంజకు అమర్చుకున్న మిషన్‌ భగీరథ నల్లా

సాక్షి,ఉప్పునుంతల : నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్‌లో మిషన్‌ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వీధుల వెంట వేసిన పైప్‌లైన్‌ పనులు సరిగా చేయకపోవడంతో లీకేజీలతో త్రాగునీరు వృథాగా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లో భాగంగా వేసి ఉంచిన పైప్‌లకు తూతూ మంత్రంగా నల్లాలు అమర్చారని తెలిపారు. కాంట్రాక్టర్‌ కేవలం వంతుకు గంతేసినట్లు పనులు చేపట్టారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించలేదని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు భగీరథ పనులను నాణ్యతతో చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement