రైతులు ఆందోళన చెందవద్దు: హరీశ్‌ | Minister Harish Rao comments on Grain Purchasing | Sakshi
Sakshi News home page

రైతులు ఆందోళన చెందవద్దు: హరీశ్‌

May 6 2018 1:29 AM | Updated on Oct 1 2018 2:19 PM

Minister Harish Rao comments on Grain Purchasing - Sakshi

సాక్షి, మెదక్‌: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెం దవద్దని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ మెదక్‌ పట్టణానికి రానున్న నేపథ్యంలో శనివారం మంత్రి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, బహిరంగసభాస్థలిని ఆయన డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి పరిశీలించారు.

అనంతరం ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం, హమాలీల కొరత కారణంగా కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు.  ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement