‘మెట్రో’ సమస్యలకు త్వరలో పరిష్కారం: కలెక్టర్ మీనా | 'Metro' issues resolved soon: Collector Meena | Sakshi
Sakshi News home page

‘మెట్రో’ సమస్యలకు త్వరలో పరిష్కారం: కలెక్టర్ మీనా

Oct 30 2014 1:19 AM | Updated on Oct 16 2018 5:16 PM

‘మెట్రో’ సమస్యలకు త్వరలో పరిష్కారం: కలెక్టర్ మీనా - Sakshi

‘మెట్రో’ సమస్యలకు త్వరలో పరిష్కారం: కలెక్టర్ మీనా

సెయింట్ థామస్ చర్చి వద్ద జరుగుతున్న మెట్రో పనుల్లో తలెత్తిన సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అన్నారు.

రాంగోపాల్‌పేట్: సెయింట్ థామస్ చర్చి వద్ద జరుగుతున్న మెట్రో పనుల్లో తలెత్తిన సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. ఇక్కడ పనులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చర్చి కమిటీ ప్రతినిధులు నిర్మాణం పనులు అడ్డుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా బుధవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా చర్చి కమిటీ ప్రతినిధులు సమస్యను కలెక్టర్‌కు వివరించారు. ఆల్ఫా హోటల్, దాని పక్కనే ఉన్న పెట్రోల్ బంకు స్థలం తమదేనని, అందులో నుంచి మెట్రో లైన్ వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ అలాకాకుండా ప్రార్థనలు, సభలు, వివిధ సంస్థల కార్యకలాపాలు జరుపుకునే మైదానం, ప్రేయర్‌హాల్ గుండా లైన్ వెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తాయని కలెక్టర్‌కు విన్నవించారు. 162 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చి ఆస్తులను ఇలా అడ్డగోలుగా లాక్కోవడం మెట్రో అధికారులకు తగదని చెప్పారు.

గతంలో తమకు వారు హామీ ఇచ్చి కూడా దాన్ని విస్మరించారని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చర్చి ప్రతినిధులు 5 నుంచి 7 మీటర్లు బయటకు జరిగి నిర్మాణాలు చేసుకోమంటున్నారని, దీన్ని పరిశీలిస్తామన్నారు. అన్ని వర్గాలతో చర్చించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొంటామని చర్చి ప్రతినిధులు శామ్యూల్ థామస్, దాస్ రాబర్ట్ తదితరులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement