తుమ్మలకు వినతిపత్రం అందించిన సాక్షి ఈడీ.. | Memorandum For The Creation Of College | Sakshi
Sakshi News home page

కళాశాలకై అ‘పూర్వ’ ప్రయత్నం

Jun 8 2018 11:28 AM | Updated on Aug 20 2018 8:24 PM

Memorandum For The Creation Of College - Sakshi

మంత్రి తుమ్మలకు వినతిపత్రమిస్తున్న సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, తల్లాడ పూర్వ విద్యార్థులు 

తల్లాడ ఖమ్మం : పేద, స్థానిక విద్యార్థుల సౌలభ్యం కోసం తల్లాడలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని..ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు గురు వారం మంత్రులకు విన్నవించారు.

దశాబ్దాల క్రితం ఇక్కడ చదువుకుని..వివిధ హోదాల్లో, తీరొక్క ప్రాంతాల్లో ఉంటున్న వారంతా..ఈ ప్రాంత విద్యార్థుల బాగు కోసం ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కొండభట్ల రామచంద్రమూర్తితో పాటు..జెడ్పీటీసీ సభ్యుడు మూకర ప్రసాద్, జక్కంపూడి కృష్ణమూర్తి, కొండుభట్ల రాధాకృష్ణమూర్తి, డాక్టర్‌ వేమిశెట్టి ఉపేందర్‌రావు, బాజోజు శేషభూషణం, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, గుం టుపల్లి వెంకటయ్యలు అంతా కలిసి హైదరాబాద్‌లో ఇద్దరు మంత్రులను కలిశారు. సమస్య తీవ్రతను వివరించారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement