ఆర్‌ఏఎస్‌ పద్ధతి బాగుంది

Meghalaya Minister Praised the Performance of Fisheries Recycling Unit in Telangana - Sakshi

మేఘాలయ మంత్రి కురమన్‌ ఉరియా 

గుండేడ్‌లో వ్యవసాయ క్షేత్రం పరిశీలన

బాలానగర్‌ (జడ్చర్ల): రీ–సైక్లింగ్‌ ఆక్వా సిస్టం (ఆర్‌ఏఎస్‌) బాగుందని మేఘాలయ మత్స్యశాఖ మంత్రి కురమన్‌ ఉరియా అన్నారు. సోమవారం బాలానగర్‌ మండలం గుండేడ్‌ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు విశ్వనాథరాజు తక్కవ నీటితో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలను ఎలా పెంచాలనే దానిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాగా, ఇదే పద్ధతిని గౌహతి వద్ద అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీకృష్ణ, మేఘాలయ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ ఐతిమోలాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top