తెలంగాణ ప్రభుత్వానికి మేఘ సంస్థ రూ. 5కోట్ల విరాళం

Megha Engineering And Infrastructures Limited Donation To Telangana Government Over Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ను తరిమి కొట్టడానికి యావద్దేశం పోరాడుతోంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్‌ మహమ్మారిని పారద్రోలటానికి అహర్నిశలా శ్రమిస్తున్నాయి. సినీ, రాజకీయ, ఇతర రంగాల వారు తమవంతు సహాయంగా ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్‌ లిమిటెడ్‌ తనవంతుగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది.

ఇదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు బాధ్యతగా రూ. 5 కోట్లను విరాళంగా ఇచ్చింది. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేఘ ప్రశంసించింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి శక్తి సామర్ధ్యాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మేఘ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు 5 కోట్ల రూపాయల చెక్కును మేఘ అధినేత పీవీ  కృష్ణారెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top