
మీ సేవలకు వైరస్
ప్రతి మండలానికి నియమించిన టాస్క్‌ఫోర్స్‌లో తహశీల్దార్, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆర్ఐ, ఓ టెక్నికల్ అధికారి ఉంటారు.
ప్రగతినగర్ : ప్రతి మండలానికి నియమించిన టాస్క్‌ఫోర్స్‌లో తహశీల్దార్, డీటీ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆర్ఐ, ఓ టెక్నికల్ అధికారి ఉంటారు. వీరు 2014 జూలై నుంచి మీ-సేవ సెంటర్లలో కంప్యూటరీకరించిన ధ్రువీకరణ పత్రాలు, వాటి వివరాలకు సంబంధిం చిన హార్డ్‌డిస్క్‌లను రోజువారీగా పరిశీలించనున్నారు.అప్పటి నుంచే మీ-సేవల్లో దరఖాస్తుదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మంగళవారం నుం చి టాస్క్‌ఫోర్స్ కార్యాచరణలోకి దిగనుంది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం సామాజిక ఫించన్ డబ్బులను పెం చింది. పింఛన్ల మంజూరుకు ఆధార్‌కార్డుల్లో నమోదైన వయస్సును పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఆధార్ కార్డులతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఫాస్ట్‌స్కీంకు దరఖాస్తుల స్వీక రణ, పట్టాపాస్ పుస్తకాలు, ఈ-రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ లాం టి వాటికి మీ సేవలకు అనుసంధానం చేసింది. దీంతో మీ-సేవలకు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. గతంలో అన్ని సంక్షేమ పథకాలు రేషన్ కార్డుల నంబర్‌తో ముడిపెట్టేవారు.
ప్రస్తుతం ఆ విధానానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుడ్‌బై చెప్పింది. రేషాన్ కార్డుల స్థానంలో బోగస్ కార్డులను అరికట్టడానికి ఆహార భద్రతా కార్డులను తీసుకు వస్తోంది. అయితే సంక్షేమ పథకాలకు ప్రస్తుతం ఆధార్ కార్డుల నం బర్‌తో ముడిపెడుతోంది. ఆరు నెలలుగా దరఖాస్తులు మీ-సేవ సెంటర్లకు వస్తున్నాయి. ఇది ‘ఆసరా’గా చేసుకొన్న మీ-సేవ నిర్వాహకులు దరఖాస్తుదారులకు ఆధార్ కార్డులను, ఇతర ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. మరి కొంత మంది నిర్వాహకులు ఒక అడుగు ముందుకేసి బోగస్ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, ఇతరాత్రా ధ్రువీకరణ పత్రాలకు తెర లేపారు.
ఇటీవల జిల్లా కలెక్టర్ నగరంలోని 24వ డివిజన్‌లో పర్యటించినప్పుడు స్వయంగా 16 బోగస్ ఆధార్ కార్డులను గుర్తించారు. వాటిలో పేర్లతో సహా వయస్సును కూడా మీసేవ సెంటర్‌ల నిర్వాహకులు మార్చివేశా రు. వెంటనే విచారణ జరిపి నగరంలోని అహ్మద్‌పుర, కేర్ డిగ్రీ కళాశాల, తిలక్‌గార్డెన్‌లోని మీసేవ సెంటర్‌లను సీజ్ చేయించారు. ఆ తర్వాత కామారెడ్డిలో, పిట్లంలో ఒక్కో సెంటర్‌ను మూసివేయించారు.
ఈ నేపథ్యంలో నగరంతో పాటు మూడు మున్సిపాలిటీలు, మండలాల్లో ఉన్న మొత్తం 332 మీ -సేవ సెంటర్‌ల హార్డ్‌డిస్క్‌లను పరిశీలించాల్సిం దిగా తహశీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో హెచ్‌సీఎల్, ఏపీ ఆన్‌లైన్, సీఎంఎస్ కంపెనీలకు సంబంధించిన మీ-సేవలు నడుస్తున్నాయి.ఈ కంపెనీలకు ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిన ఒక్కో సర్వీసుకు ఒక చార్జిని నిర్ణయించింది. అదే ప్రకారం మీ-సేవలో దరఖాస్తుల దారుల దగ్గర రుసుము తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి.
అయితే ఎక్కడ కూడా మీ-సేవా నిర్వాహకులు నిర్ణయించిన రుసుము ప్రకారం డబ్బులు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ఒకటైతే వీరు వసూలుచేసే రేటు మారోవిధంగా ఉంటోంది. ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వ నిర్ణయించిన రేటు ప్రకారం రూ. 15 తీసుకోవాల్సి ఉండగా రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. బోగస్ ఆధార్ కార్డులనూ ఇవ్వడం మొదలు పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం సామాజిక పింఛన్లకు వయస్సును 65 సంవత్సరాలకు పెంచడంతో తక్కువ వయస్సున్న వారు 65 సంవత్సరాలకుపైగా వయస్సును వేయించుకుంటున్నారు. ఇందుకోసం మీసేవ నిర్వాహకులు ఒక్కొక్కరి వద్ద సుమారు రూ.3000 వరకు వసూలు చేస్తున్నారు. బోగస్ ఆధార్ కార్డులు బయటపడడంతో కలెక్టర్ మీ-సేవల నిర్వహణను నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జూలై నుంచి ఇప్పటి వరకు ఎంత మందికి ఆధార్ కార్డులు ఇచ్చా రు, ఇంకెంత మందికి ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తు చేసుకొన్నవారి వివరాలు, వయస్సు మార్పిడి కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు మీసేవ కేంద్రాల్లోని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకోవాలని సూచిం చారు. మీ సేవలపై చర్యలతో అక్రమార్కుల గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.