నిద్రమత్తులో యువకుడు మృతి | man dies of construction building | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో యువకుడు మృతి

Apr 15 2015 5:33 PM | Updated on Apr 3 2019 8:07 PM

నిద్రమత్తులో ప్రమాదవశాత్తూ నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నిద్రమత్తులో ప్రమాదవశాత్తూ నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఇల్లూర్ గ్రామానికి చెందిన షాహిద్ బాషా అలియాస్ మున్నా(23) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలోని లోటస్ పాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనిచేస్తున్నాడు.


మంగళవారం అర్దరాత్రి నిర్మాణంలో ఉన్న ఆ భవనం ఐదో అంతస్తుపై పడుకుని నిద్రపోయాడు. కాగా నిద్ర మత్తులో పక్కకు దొర్లడంతో కింద పడిపోయాడు. దాంతో తలకు తీవ్ర గాయాలవడంతో ఈ విషయాన్ని గమనించిన సహచర కూలీలు ఖాజా, రాజులు అతణ్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement