సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి | Man died while charging of his mobile | Sakshi
Sakshi News home page

సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి

Feb 6 2016 5:00 AM | Updated on Sep 3 2017 5:01 PM

సెల్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ

 పెద్దవూర: సెల్ చార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధిలో గల పాత జయరాం తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్ హేమా(26) తన ఇంట్లో సెల్ చార్జింగ్ పెట్టడానికి స్విచ్‌ను ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. హేమాను చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే హేమా మృతి చెందాడని ఆగ్రహిస్తూ తండా వాసులు అతడి శవంతో మండలంలోని పొట్టిచెల్మ సబ్ స్టేషన్ ఎదుట నాగార్జునసాగర్- హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో కిలో మీటరు మేర వాహనాలు ఆగిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement