సూర్యుడి ప్రతాపానికి మరో ఉపాధి కూలీ బలైపోయాడు.
ఖానాపూర్ : సూర్యుడి ప్రతాపానికి మరో ఉపాధి కూలీ బలైపోయాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. వివరాల ప్రకారం... పాత ఎల్లాపూర్‌కు చెందిన ముత్తన్న (53) అనే వ్యక్తి ఉపాధి హామీ పథకంలో భాగంగా శనివారం పనికి వెళ్లాడు. అయితే పని చేస్తుండగా ఎండ వేడిమికి వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.