మహకూటమితోనే అభివృద్ధికి బాటలు.. | Mahakutami Will Doing More Development | Sakshi
Sakshi News home page

మహకూటమితోనే అభివృద్ధికి బాటలు..

Nov 19 2018 9:46 AM | Updated on Mar 6 2019 6:09 PM

Mahakutami Will Doing More Development - Sakshi

సాక్షి, ఆత్మకూర్‌: రాష్ట్ర ప్రజలను మోసంచేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలంటే మహాకూటమిని గెలిపించాలని మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌ మండలంలోని బాలకిష్టాపూర్, పిన్నంచర్ల, మూళమల్లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లను డబుల్‌ చేస్తామని, ఇంటి స్థలం ఉన్న వారందరికీ ఇంటినిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బాలకిష్టన్న, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అయూభ్‌ఖాన్, రామలక్ష్మారెడ్డి, రహ్మతుల్లా, బాలకిష్ణారెడ్డి, ఎస్టీడీ శ్రీను, అశ్విన్‌కుమార్, పుట్నాల రమేష్, వెంకటేష్, శేఖర్, గంగాధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  


వండిపెడతా.. ఓటేయమ్మా.. 
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్‌ రెడ్డి ఆత్మకూర్‌ మండలంలోని గోపన్‌పేట గ్రామంలో వంటింట్లోకి వెళ్లిమరీ వంటచేస్తు తనకు ఓటువేయాలని అభ్యర్థించారు. 
టీఆర్‌ఎస్‌ను సాగనంపాలి 


మదనాపురం: కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్‌ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కరివెన, గోపన్‌పేటలో ఇంటింటి ప్రచారం చేశారు.కార్య క్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాలకిష్టన్న, టీడీపీ మండల అధ్యక్షుడు నాగన్న యాదవ్, బాలకిష్ణారెడ్డి, రామలక్ష్మారెడ్డి, ఎస్‌టీడీ శ్రీను, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

చిన్నారెడ్డి గెలుపునకు పూజలు


పెబ్బేరు: మండలంలోని సూగూర్‌లో కాంగ్రెస్‌ నాయకులు నర్సింహ్మనాయుడు   ఆధ్వర్యంలో ఆదివారం రామాలయంలో పూజలు చేశారు. వనపర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నారెడ్డి గెలువాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మచ్చలేని నాయకుడని కొనియాడారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మన్, బుచ్చన్నయాదవ్, మండగిరి రాముడు, గోవిందు, మధు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement