అయ్యో దేవుడా! | lovers commit to suicide | Sakshi
Sakshi News home page

అయ్యో దేవుడా!

Mar 26 2015 1:51 AM | Updated on Nov 6 2018 7:56 PM

అయ్యో దేవుడా! - Sakshi

అయ్యో దేవుడా!

వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన మాటేటి హిరణ్మయి(19), గుడిమెల్ల సాయిక్రిష్ణ(20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఎంత పని చేశావు..
{పేమజంట ఆత్మహత్య
రైలు కింద పడి మృత్యువాత
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులే..
ఖమ్మం జిల్లాలో ఘటన
కరీమాబాద్‌లో విషాదం

 
 ‘‘అయ్యో దేవుడా! ఎంత పని చేశావు.. ఇరవై
 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం..
 బాబు, పాప పుట్టగానే సంతోషించాం.. వారే
 జీవితం అనుకుున్నాం.. బాగా చదువుకుని..
 ప్రయోజకులు అవుతారనుకున్నాం.. ఇలా
 అర్ధంతరంగా చనిపోతారనుకోలేదు..
 ప్రేమ రూపంలో మృత్యువు వస్తుందను
 కోలేదు.. మాకు కడుపుకోత మిగిల్చి..
 దుఖఃసాగరంలో నెట్టారు..!’’ అంటూ
 ఖమ్మం జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య
 చేసుకున్న ప్రేమికులు హిరణ్మరుు,
 సారుుక్రిష్ణ తల్లిదండ్రులు రోదించిన
 తీరు అందరినీ కలచి వేసింది..
 

కరీమాబాద్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన మాటేటి హిరణ్మయి(19), గుడిమెల్ల సాయిక్రిష్ణ(20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు హసన్‌పర్తి మండలం అనంతసాగర్ ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు హైస్కూల్ వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి ఇష్టపడ్డారు. ఆ తర్వాత మళ్లీ బీటెక్‌లో ఒకే గ్రూపు, ఒకే క్లాస్ కావడంతో ఆ ప్రేమ  అలాగే కొనసాగించారు. హిరణ్మయి తండ్రి రవీందర్ వరంగల్ మున్సిపల్‌లో కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా, తల్లి నీరజ గృహిణి. ఇం కా హిరణ్మయికి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అక్క శ్వేత, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్నయ్య రాకేష్ ఉన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న గుడిమెల్ల సాయిక్రిష్ణ ఒకే ఒక్క కుమారుడు కాగా తన తండ్రి ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో తల్లి విమలతోనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి హిరణ్మయి సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యు లు వెతికినా ఫలితం లేకపోరుుంది. బుధవా రం ఉదయం ఖమ్మం జీఆర్‌పీ పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డ హిరణ్మయి తండ్రి రవీందర్‌కు, సాయిక్రిష్ణ తల్లి విమలకు ఫోన్ చేశారు. హిరణ్మయి, సాయిక్రిష్ణలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారనే తెలిపారు. దీం తో ఇరువురి తల్లిదండ్రులు ఒక్కసారి కుప్పకూలారు. చాలా ఏళ్లుగా సాయిక్రిష్ణ, హిరణ్మ యి ప్రేమించుకుంటుండడం.. వారి ప్రేమను తల్లిదండ్రులుఒప్పుకోకపోవడమో..మరేదైనా కారణంతోనో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, మిత్రులు తెలిపారు. కాగా, ప్రేమికుల మృతితో కరీమాబాద్‌లో విషాద చాయలు అలుముకున్నారుు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement