మృతదేహంతో కామినేని జంక్షన్ వద్ద ధర్నా | locals protest with dead body infront Kamineni junction in nalgonda district | Sakshi
Sakshi News home page

మృతదేహంతో కామినేని జంక్షన్ వద్ద ధర్నా

Jan 3 2016 6:49 PM | Updated on Aug 30 2018 3:56 PM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం జరిగిన ఘోర ప్రమాదంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. నార్కట్‌పల్లికి చెందిన కొమిరెల్లి వెంకట్ (65) రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనగా, ఎగిరి కారుపై పడిపోవడం.. డ్రైవర్ ఆపకుండా 20 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లడం తెలిసిందే.

ఈ ఘటనతో నార్కట్‌పల్లి వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కామినేని ఆస్పత్రి వై జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ వెంకట్ మృతదేహంతో ధర్నాకు దిగారు. పోలీసులు వారికి సర్దిచెప్పడంతో తమ ధర్నాను విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement