
ఫైల్‌ఫోటో
సాక్షి, నిజామాబాద్ : డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీతో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వారికి చిరుత కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వర్సిటీలోని ఎంసీఏ భవనం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిరుత గాలింపు కోసం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్సిటీ ఆవరణలో చిరుత పులి పాద ముద్రల కోసం ఇందల్‌వాయి అటవీ రేంజి అధికారులు, సిబ్బంది అన్వేషిస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 22వ తేదీన తిరిగి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు.