హడ్కో అవార్డు అందుకున్న కేటీఆర్ | ktr wins hudco award | Sakshi
Sakshi News home page

హడ్కో అవార్డు అందుకున్న కేటీఆర్

Apr 27 2015 11:53 AM | Updated on Sep 3 2017 12:59 AM

తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హడ్కో అవార్డు అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు.

న్యూఢిల్లీ :  తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హడ్కో అవార్డు అందుకున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ప్రత్యేక అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం  సందర్భంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రక్షిత మంచినీటి పథకాన్ని 4ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు.

ఇక నేపాల్లో చిక్కుకున్న భరత్పూర్ మెడికల్ విద్యార్థులను ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement