కౌంటింగ్‌కు కేటీఆర్ దూరం | KTR not attend to general election counting | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు కేటీఆర్ దూరం

May 16 2014 3:16 AM | Updated on Aug 15 2018 7:56 PM

కౌంటింగ్‌కు కేటీఆర్ దూరం - Sakshi

కౌంటింగ్‌కు కేటీఆర్ దూరం

సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కె.తారకరామారావు శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు దూరంగా ఉంటున్నారు.

సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కె.తారకరామారావు శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు దూరంగా ఉంటున్నారు. 2009లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగగా.. ఆయన కౌంటింగ్‌కు దూరంగానే ఉన్నారు. 2010 ఉప ఎన్నికల్లో మాత్రం కౌంటింగ్‌కు హాజరయ్యారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు తనదే అన్న ధీమాతో కేటీఆర్ కౌంటింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాలను పర్యవేక్షించే బాధ్యత కేటీఆర్ తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన ఓట్ల లెక్కింపునకు రావడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement