ఖానాపూర్ లో నీటి కోసం గ్రామస్తుల నిరసన | khanapur villagers protest on water problems | Sakshi
Sakshi News home page

ఖానాపూర్ లో నీటి కోసం గ్రామస్తుల నిరసన

Feb 20 2015 12:04 PM | Updated on Sep 2 2017 9:38 PM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రజలు తాగు నీటికోసం నిరసన చేపట్టారు.

ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రజలు తాగు నీటికోసం నిరసన చేపట్టారు. బాదనకుర్తిలో కొన్ని రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవటం లేదంటూ శుక్రవారం ఉదయం ప్రధాన రహదారిపైకి చేరి గ్రామస్తులు నిరసన చేశారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో ప్రారంభించారు. దీంతో ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను ఇళ్లకు పంపించివేశారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement