తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు శనివారం మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు శనివారం మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని అన్ని పట్టణాలను పరిశుభ్రమైన, పచ్చటి వాతావరణం గల నగరాలుగా మార్చాలని అన్నారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే మంత్రులను, అధికారులను ఉపేక్షించేది లేదని, ఎవరినైనాసరే పదవి నుంచి తప్పిస్తానని కేసీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చెత్తకుండీలుగా మారాయి, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని కేసీఆర్ చెప్పారు. మేయర్లు, ఛైర్మన్లు, కార్పొరేటర్లకు
హైదరాబాద్‌లో త్వరలో మూడ్రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా చేపడుతున్న నిర్మాణాల నియంత్రణకు అవసరమైతే కొత్త చట్టం తీసుకువస్తామని వెల్లడించారు. ప్రపంచంలో టౌన్ ప్లానింగ్‌లో అభివృద్దిపథంలో ఉన్న దేశాలను అధ్యయనం చేయాలని చెప్పారు. మున్సిపల్ వ్యవహారాల్లో అవినీతి వ్యవస్థీకృతమైందని ఈ పరిస్థితి మారాలని కేసీఆర్ సూచించారు.