ఈనెల 29వ తేదీన నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు.
థర్మల్, నక్కలగండి ప్రాజెక్టుల శంకుస్థాపన, వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ
నల్లగొండ: ఈనెల 29వ తేదీన నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ఈనెల 29 ముహూర్తంగా ఖరారు చేసినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు హెలికాప్టర్ ద్వారా జిల్లాకు రానున్న కేసీఆర్.. మొదట వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణతోపాటు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం టీఆర్‌ఎస్ తరఫున నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎంకు సంబంధించిన పూర్తిస్థాయి పర్యటనవివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.