breaking news
on 29th
-
కొల్లేరు హామీలు అమలు చేస్తాం
మంత్రి కామినేని 29న పెద్దింట్లమ్మ వారధికి శంకుస్థాపన సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు రాక కైకలూరు : ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రకటించిన హామీలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పెద్దలతో ఆదివారం సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వారధి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మంత్రులు హాజరవుతారని తెలిపారు. గతంలో వారధి నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయించారని, ఇప్పుడు పెరిగిన ఖర్చులను పరిగణలోకి తీసుకుని నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో Mýృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ అధ్యక్షులు సైదు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజులు పాల్గొన్నారు. భూముల పంపిణీపై.. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణాజిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన భూముల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇక కొల్లేరు కాంటూరు కుదింపు అంశం కేంద్ర స్థాయిలో ఉందన్నారు. -
29న నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన!
థర్మల్, నక్కలగండి ప్రాజెక్టుల శంకుస్థాపన, వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ నల్లగొండ: ఈనెల 29వ తేదీన నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ఈనెల 29 ముహూర్తంగా ఖరారు చేసినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు హెలికాప్టర్ ద్వారా జిల్లాకు రానున్న కేసీఆర్.. మొదట వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణతోపాటు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం టీఆర్ఎస్ తరఫున నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎంకు సంబంధించిన పూర్తిస్థాయి పర్యటనవివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.


