పాస్‌ పుస్తకంపై నా ఫొటో వద్దు: కేసీఆర్‌

KCR disagree to print his photo on New pattadar passbooks for farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు ఇచ్చే కొత్త పాస్‌ పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. కొత్తగా ఇచ్చే పాస్‌ పుస్తకాల నమూనాలను శుక్రవారం ప్రగతి భవన్‌లో అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. పచ్చని పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్‌ పుస్తకాన్ని సీఎం ఎంపిక చేశారు. పాస్‌బుక్‌లో తన ఫొటో ఉన్న నమూనాలను కూడా అధికారులు ఈ సందర్భంగా కేసీఆర్‌కు చూపించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘పాస్‌ పుస్తకంపై రైతు ఫొటో తప్ప మరెవరి ఫొటో వద్దు. రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదు. కేవలం రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే పాస్‌ పుస్తకంపై ఉండాలి’అని ఆదేశించారు.

‘నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు నిధులివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్ల సెస్‌కు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సెస్‌ పాలకవర్గం కోరింది. శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్, పలువురు డైరెక్టర్లు కేంద్రమంత్రిని కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సెస్‌ అభివృద్ధి, పనితీరు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top