కరక్కాయ స్కాం.. నిందితుల అరెస్ట్‌

Karakkaya Scam Police Catch Accused - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మల్లిఖార్జున్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 44 లక్షల రూపాయలతో పాటు కరక్కాయ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించింది విషయం తెలిసిందే.

గతనెల 16న కేపీహెచ్‌బీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ఈ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కరక్కయ పొడి చేసి ఇస్తే అధిక మొత్తం చెల్లిస్తామంటూ దగా చేసిన నిందితులు కోట్ల రూపాయలను దండుకున్న విషయం తెలిసిందే. ఈ స్కాంలో 10 కోట్లకు పైగా మోసం జరిగిందని సీపీ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top