హనీమూన్ అనే ఆగాం..! | Jana reddy takes on TRS party indirectley | Sakshi
Sakshi News home page

హనీమూన్ అనే ఆగాం..!

Mar 15 2015 1:59 AM | Updated on Sep 2 2017 10:51 PM

హనీమూన్ అనే ఆగాం..!

హనీమూన్ అనే ఆగాం..!

కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌పై వెంటనే విమర్శలు చేస్తే తొందరపడుతున్నామనే భావన రాకుండా ఉండడానికే హనీ మూన్ సమయం ఇచ్చాం...

* ప్రజా సమస్యలపై పభుత్వాన్ని ఎండగడతాం..
* కట్టుతప్పిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉంటాం
* షబ్బీర్‌పై విమర్శలు సరికాదు మీడియాతో ప్రతిపక్షనేత జానారెడ్డి

 
 సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్‌పై వెంటనే విమర్శలు చేస్తే తొందరపడుతున్నామనే భావన రాకుండా ఉండడానికే హనీ మూన్ సమయం ఇచ్చాం... అంతేకానీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నామని భావించడం సరికాదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ తప్పిన పార్టీ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షపాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత షబ్బీర్ అలీపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను జానారెడ్డి ఖండించారు.  
 
 టీడీపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యవ్యవస్థకు మంచిది కాదని, వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరామన్నారు. జాతీయగీతాలాపన సమయంలో జరి గిన ఘర్షణలకు సంబంధించిన వీడియో సీడీల పుటేజీలను పూర్తిగా చూపించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖ రాసినట్టు చెప్పారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపైనా స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. టీపీసీసీ, సీఎల్పీ మధ్య ఎలాంటి విభేదాల్లేవని, అలా ఉన్నాయని ఎవరైనా చెబితే వా రి వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కు ఏది ఉపయోగమో, వాటికోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని రావడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. సీఎల్పీలతో విభేదాలున్నాయని చెప్పే నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించినట్టేనన్నారు. క్రమశిక్ష ణ లేకుండా మాట్లాడడం తనకు చేతకాదన్నారు.
 
 ‘జానా’నే సీఎం చేస్తారేమో..
 ‘ మా నాయకుడు జానారెడ్డి మాటనే శిరోధార్యం అంటూ సీఎం అంటున్నరు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదని అంటున్నరు. ఆయన చికిత్సకోసం అమెరికా పోతున్నారని, కేటీఆర్‌ను సీఎం చేస్తారని కూడా అంటున్నరు. అయితే కేటీఆర్‌నో, హరీశ్‌రావునో కాకుండా జానారెడ్డినే సీఎం చేస్తారే మో? ఆయనను సీఎం చేస్తే అడిగేవారు కూ డా ఉండరు’ అంటూ అసెంబ్లీ లాబీల్లో తన ను కలసిన విలేకరులతో చిన్నారెడ్డి పిచ్చా పాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement