
హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.జగన్నాథరావు ఎన్నికయ్యారు. మంగళవారం విద్యానగర్‌లోని సంస్థ కార్యాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినట్లు సంస్థ ఎన్నికల అధికారి వెల్దండ బల్వంతరావు వెల్లడించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్.రఘునాథరావు, ప్రధాన కార్యదర్శిగా కె.రామారావు, సంయుక్త కార్యదర్శిగా సి.రుక్మిణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె.శ్యామ్, కోశాధికారిగా ఆర్.వెంకటేశ్వర్‌రావు, సంస్థ గౌరవాధ్యక్షుడిగా కె.సురేశ్ చందర్‌రావు ఎన్నికైనట్లు తెలిపారు. అలాగే నలుగురు కార్యవర్గ సభ్యులను, ఐదుగురు సలహాదారులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన కార్యవర్గం 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు.