
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపాధ్యాయులను నిందించడం సరికాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈమేరకు ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ఎమ్మెస్ కిష్టప్ప శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు సరైన పనితీరు కనబర్చకుంటే అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవచ్చని..కానీ అనవసరంగా నిందిస్తూ మానసిక వేదనకు గురిచేయవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.