ఎస్‌ఏ పోస్టుకు బీటెక్‌–బీఈడీ చదివితే సరిపోదు!

It is not enough to read BETech-BED for SA Post! - Sakshi

బీఈడీలో మేథమెటిక్స్‌ చదివి ఉండాల్సిందే: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్‌ (మేథమెటిక్స్‌) పోస్టుకు దర ఖాస్తు చేసుకునేందుకు బీటెక్‌–బీఈడీ చదివితే సరిపోదని, బీఈడీలో తప్పనిసరిగా మేథమెటిక్స్‌ మెథడాలజీ చదివి ఉండాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బీటెక్‌ చేసి బీఈడీలో మేథమెటిక్స్‌ మెథడాలజీ చదవని అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించడంలో తప్పు లేదంది. ఈ విషయంలో అధికారులను తప్పుపట్టలేమని పేర్కొంది.

తన దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ఓ అభ్యర్ధి దాఖ లు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన టీఆర్‌టీ నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసి స్టెంట్‌ (మేథమెటిక్స్‌) పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మేథమెటిక్స్‌లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలని, దీంతోపాటు ఎన్‌సీటీఈ గుర్తింపు ఉన్న విద్యా సంస్థ నుంచి బీఈడీలో మేథమెటిక్స్‌ను తప్పనిసరిగా చదివి ఉండాలని నిర్దేశించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top