పిల్లల సిరప్‌ నాసిరకమే!

Iron-folic acid is fake - Sakshi - Sakshi

ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ మందు ఉత్తదే

62.33 లక్షల సీసాల సరఫరాకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అనుమతి

44 లక్షల సీసాల కొనుగోలు.. అందులో 35 లక్షల సీసాలు నాసిరకం!

నకిలీల్లో ‘మెడికోల్‌’ కంపెనీ ఔషధాలు

సాక్షి, హైదరాబాద్‌: పేదల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు వైద్య, ఆరోగ్య శాఖలోని అధికారులు తూట్లు పొడు స్తున్నారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసే మందుల విషయంలో కళ్లు మూసుకోవ డంతో కంపెనీలు రెచ్చిపోతున్నాయి. పిల్లల మందు ల్లోనూ నాసిరకమే ఉంటున్నాయి.

కోట్లు పోస్తున్నా.. లాభమేంటి?
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మందుల సరఫరాకు ఏటా సగటున రూ.200 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) మందు లను కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. వీటిలో ఎక్కువ శాతం చిన్న పిల్లల మందులే ఉంటున్నాయి. పిల్లల్లో రక్తహీనత సమస్యను తొలగించేందుకు వినియో గించే ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ సిరప్‌ కొనుగోళ్ల వ్యవహారం అక్రమాల పుట్టలా మారింది. ఈ ఏడాదిలో ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ సిరప్‌ల సరఫరా కోసం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ టెండర్లు పిలిచింది.

62.33 లక్షల సీసాల సిరప్‌లను సరఫరా చేసేందుకు మెడిపోల్‌ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఒక్కో సీసా 60 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉంటుంది. టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ అనుమతితో మెడిపోల్‌ కంపెనీ 44 బ్యాచ్‌లకు చెందిన 44 లక్షల సీసాలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి సరఫరా చేసింది. ఒక్కో సీసాకు రూ.5.67 చొప్పున మొత్తం రూ.2.49 కోట్ల నిధులతో వీటిని కొనుగోలు చేసింది.

ఇవి రాష్ట్రవ్యాప్తంగా పది పాత జిల్లా కేంద్రా ల్లోని గోదాములకు చేరాయి. అక్కడ్నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలి వెళ్లాయి. నాసి రకంగా ఉన్నాయంటూ కొందరు వైద్యులు ఫిర్యాదు చేయడంతో మెడికోల్‌ కంపెనీ మం దులను పరీక్షలకు పంపారు. ఇందులో 44 బ్యాచ్‌ల్లో  35 బ్యాచ్‌ మందులు నాసిరకం గా తేలాయి. 62.33 లక్షల సీసాల్లో దాదాపు 35 లక్షల సిరప్‌ సీసాలు నాసిరకమైనవని తేలాయి. ఈ సిరప్‌లను వెనక్కి తరలించేం దుకు అంతర్గతంగా దేశాలు జారీ అయ్యాయి.

ఉద్దేశపూర్వకమేనా?
నాసిరకం మందులపై ఫిర్యాదులు రావడంతో  నేషనల్‌ డ్రగ్‌ సర్వే పేరిట దేశవ్యాప్తంగా 8,286 ఔషధాల నమూనాలను కేంద్ర ఆరోగ్య శాఖ సేకరించి పరీక్షించింది. ఇందు లో 62 కంపెనీలకు చెందిన 946 రకాల మం దులు నాసిరకమైనవని తేలాయి. మెడిపోల్‌  కంపెనీకి చెందిన 20 నమూనాలు నాసిరక మని తేలాయి. అయినా,అదే కంపెనీకి కోట్ల రూపాయల మందుల సరఫరాకు అనుమతి ఇవ్వడం గమనార్హం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top