నల్లగొండ జిల్లాలో శిశు విక్రయం | Infant sold by Parents in Nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో శిశు విక్రయం

Aug 20 2015 6:15 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లాలో మరో శిశు విక్రయం వెలుగుచూసింది. దామరచర్ల మండలంలోని ఎర్రనాము కాలనీకి చెందిన బలుగూరి సుజాత, యాకోబ్‌లకు ఇద్దరు ఆడ సంతానం.

దామరచర్ల (నల్లగొండ) : నల్లగొండ జిల్లాలో మరో శిశు విక్రయం వెలుగుచూసింది. దామరచర్ల మండలంలోని ఎర్రనాము కాలనీకి చెందిన బలుగూరి సుజాత, యాకోబ్‌లకు ఇద్దరు ఆడ సంతానం. కాగా ఇరవై రోజుల కిందట మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో శిశువును గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన ప్లాస్టిక్ సామాను అమ్ముకునే వారికి విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు.

దీనిపై సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, స్థానిక వార్డు సభ్యురాలు శిశువు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం దాచేపల్లికి వెళ్లి చిన్నారిని తీసుకువచ్చి తల్లి ఒడికి చేర్చారు. కాగా ముగ్గురు ఆడపిల్లలను తాము సాకలేమని, మూడో సంతానాన్ని శిశువిహార్‌కు తీసుకెళ్లాలని సుజాత, యాకోబ్‌లు కోరుతున్నారు. శిశువును అమ్ముకోలేదని, సాదుకునేందుకు మాత్రమే ఇచ్చామని వారు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement