‘ఇందిరమ్మ’ ఇళ్ల అక్రమాల లెక్క తేలింది..! | indiramma homes irregularities... | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ ఇళ్ల అక్రమాల లెక్క తేలింది..!

May 7 2015 2:33 AM | Updated on Sep 3 2017 1:33 AM

‘ఇందిరమ్మ’ ఇళ్ల అక్రమాల లెక్క ఎట్టకేలకు తేలింది. అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఖానాపూర్ : ‘ఇందిరమ్మ’ ఇళ్ల అక్రమాల లెక్క ఎట్టకేలకు తేలింది. అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు నెలలుగా విచారణ సాగింది. మొదటి విడతలోనే అధికారులు మండల కేంద్రంలో ఇంటింటా తిరుగుతూ విచారణ చేపట్టారు. అక్రమార్కులు ఎవరు, అక్రమాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని బాధితులతోపాటు సంబంధిత అదికారులను కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఎట్టకేలకు లెక్క తేల్చారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పలు గ్రామాలను ఎంపిక చేసుకుని సీఐడీ అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన విచారణ తుదిదశకు చేరింది.

సీఐడీ అధికారులు అక్రమాల ఆధారాలు సేకరించడంతోపాటు లబ్ధిదారులతో మాట్లాడి అక్రమాలకు బాధ్యుల వివరాలు సేకరించినట్లు సమాచారం. మండలంలోని 199 ఇళ్లల్లో వివిధ రూపాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు నిగ్గుతేల్చారు. ఇందులో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు బిల్లు లు పొందగా, ఇంకొందరు ఒకే పేరు పై రెండు ఇళ్లపై బిల్లులు కాజేశారు. మరికొంతమంది ఇల్లు కట్టకుండానే బిల్లులు కాజేయగా, కొందరు పాత ఇళ్లపైనే బిల్లులు పొందారు.

సంబంధీకులందరికీ బుధవారం హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, సిబ్బంది ఇంటింటా తిరుగుతు నోటీసులు అందజేశారు. గురువారం ఖానాపూర్‌లోని విశ్రాంతి భవనంలో వారితో సీబీసీఐడీ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యులను ఎట్టకేలకు తేల్చిన అధికారులు ఈ విషయమై తీసుకునే చర్యలపై గురువారం వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు హౌసింగ్‌లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేపట్టడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement