ఐసెట్ పకడ్బందీగా నిర్వహించాలి | ICET armored Administer | Sakshi
Sakshi News home page

ఐసెట్ పకడ్బందీగా నిర్వహించాలి

May 11 2016 4:54 AM | Updated on Sep 3 2017 11:48 PM

ఐసెట్ పకడ్బందీగా నిర్వహించాలి

ఐసెట్ పకడ్బందీగా నిర్వహించాలి

ఐసెట్ -2016ను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి సూచించారు.

ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
 
 కేయూ క్యాంపస్ : ఐసెట్ -2016ను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో రాష్ట్రంలోని ఐసెట్ రీజినల్ సెంటర్ల కోఆర్డినేటర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న ఐసెట్ నిర్వహించనుండగా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

తొలిసారి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, 72,44 8మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని ఆయన తెలి పారు. నిర్ణీత సమయం కంటే నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. సమావేశంలో ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్, వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.సాయిలు ఇతర రీజినల్ సెంటర్ల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement