భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య... | Husband commits suicide by scolding wife | Sakshi
Sakshi News home page

భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య...

May 21 2015 10:02 PM | Updated on Sep 3 2017 2:27 AM

భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య...

భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య...

భార్య కేసు పెట్టడంతో మనస్తాపం చెంది ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉప్పల్ : భార్య కేసు పెట్టడంతో మనస్తాపం చెంది ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన దుర్గా వినోద్(25) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సౌజన్యతో అతనికి వివాహమైంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లి నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో భర్త వే ధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఇద్దరికీ ఈనెల 17న కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇదిలాఉండగా.. వినోద్ బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో డబ్బు లేదని అత్తింటివారు నన్ను చిన్న చూపు చూసేవారు. నా భార్యతో వేధింపుల కేసు పెట్టించారు. అంతేకాకుండా వేరేవారితో నాకు వివాహేతర సంబంధం అంటకట్టారు’. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా’... అని రాసి ఉంది. అత్తింటి వారి వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని వినోద్ తల్లి బాలమణి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement