ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోమవారం... తనకు రక్షణ కల్పించాలంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో A-4 నిందితుడుగా ఉన్న జెరూసలెం మత్తయ్య సోమవారం... తనకు రక్షణ కల్పించాలంటూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ సందర్భంగా ఈ నెల 20 వ తేదీలోపు మత్తయ్య అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఛార్జిషీటు కాపీని హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. కాగా కేసు తదుపరి విచారణను వచ్చే నెల 2 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.