హెల్మెట్ డ్రైవ్ చేపట్టిన సైబరాబాద్ పోలీసులు

Helmet Drive Tightened By Cyberabad Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతుండడంతో... నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం, అంతులేని నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలవుతున్నారు. పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సోమవారం సైబరాబాద్ పోలీసులు ప్రమాదాల చర్యలు నియంత్రనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా  హెల్మెట్ డ్రైవ్ చేపట్టి..  నకిలీ ఐఎస్‌ఐ(ISI) మార్క్‌తో కూడిన హెల్మెట్‌లు విక్రయించే వారిపై కొరడా జులుపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నకిలీ హెల్మెట్ అమ్మకాలు చేస్తున్న వారి నుంచి భారీగా నకిలీ హెల్మెట్లు స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాక వాటిని ధ్వసం చేయడంతో పాటు అమ్మకం దారులపై కేసులు పెట్టి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.  ఏమాత్రం నాణ్యతలేని నకిలీ హెల్మెట్ల కారణంగా నగరంలో వందలాది సంఖ్యలో వాహన దారులు ప్రమాదాలబారిన పడుతున్నారని.. అందుకే హెల్మెట్ డ్రైవ్ చేపట్టామని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

అయితే నాణ్యమైన హెల్మెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులు చౌకైన హెల్మెట్లు కొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫుట్‌పాత్‌లపై అమ్మే హెల్మెట్లు తక్కువ ధరలకు లభిస్తుండటంతో వాటిని కొంటున్నారు. అటు బడా వ్యాపారులు, బైక్‌ షోరూమ్‌లు ఎక్కువ లాభాలకు ఆశపడి రేట్లు పెంచేస్తున్నాయి. వీరిపైనా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నాణ్యమైన హెల్మెట్‌లను అధిక ధరలకు విక్రయించకుండా చూడాలని సూచిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top