హైదరాబాద్‌: దాబాలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత | Cyberabad Police Arrest Dhaba Cook With Rs 3 Crore Worth Narcotics | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: దాబాలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

May 30 2025 7:46 PM | Updated on May 30 2025 8:39 PM

Cyberabad Police Arrest Dhaba Cook With Rs 3 Crore Worth Narcotics

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కిలోన్నర హెరాయిన్‌ను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్‌ సమీపంలోని ఓ డాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నారు. హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. రూ.3 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్‌ను ఎస్‌వోటీ స్వాధీనం చేసుకుంది. సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి వివరాలను మీడియాకు వెల్లడించారు. కుక్‌గా పని చేసే  వికాస్ సోహు.. రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి అమ్ముతున్నాడు. డాబాకు వచ్చే కస్టమర్లకు మాత్రమే మాత్రమే అమ్ముతున్నారని సీపీ తెలిపారు.

నిందితుడు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని.. అతని కాంటాక్ట్ ఆధారంగా కస్టమర్స్‌పై దృష్టి పెట్టామని సీపీ వెల్లడించారు. మధ్యప్రదేశ్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులతో లింక్స్ ఉన్నాయని.. ఈ కేసులో రూ.89,700 నగదు, రూ. 30 వేల విలువైన మూడు మొబైల్ ఫోన్లు, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ కవర్ ప్యాకెట్ సీజ్ చేశామని సీపీ తెలిపారు. ధూల్‌పేట్‌కు చెందిన సలీమ్, మహేశ్వరానికి చెందిన రాజు, మధ్యప్రదేశ్‌కి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement