
సాక్షి, భద్రాద్రి : ప్రజలు సాయంత్రం సమయంలో పనులు చేసుకుంటుండగా భూప్రకంపనలు కలకలం రేపాయి. ఈ భూప్రకంపనలు జిల్లాలలోని రామవరంలో చోటుచేసుకున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించిన శబ్ధం వినిపంచడంతో ప్రజలు ఇళ్లు, దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. రామవరం ప్రధాన సెంటర్‌లోని కొన్నిచోట్ల సింగరేణి, కిన్నెరసాని నీటిసరఫరా పైపులైన్లు పగిలిపోయి నీరు బయటకు వస్తోంది.
భూప్రకంపనల కారణంగానే పైపులైన్లు పగిలిపోయి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. గతంలో ఇక్కడ సింగరేణి సంస్థ 2 ఇంక్లెన్ భూగర్భ గనని నడిపిందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అది మూతపడిందని, దాని ప్రభావంతోనే భూ ప్రకంపనలు ఏర్పడి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.