నిరుద్యోగ యువతకు వరం | Group 2 Free training classes | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు వరం

Feb 14 2016 12:52 AM | Updated on Sep 3 2017 5:34 PM

నిరుద్యోగ యువతకు వరం

నిరుద్యోగ యువతకు వరం

గ్రూప్ 2 ఉచిత శిక్షణను నిర్వహించనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

నేటి నుంచి గ్రూప్2లో శిక్షణ
సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపు

 
సిద్దిపేట జోన్
: నిరుద్యోగ యువతి, యువకులకు ఆర్థిక భారం తగ్గించి ఉద్యోగ అవకాశాలను ముంగిట్లోకి తెచ్చేందుకు తాను స్వంతంగా నియోజకవర్గంలో గ్రూప్ 2 ఉచిత శిక్షణను నిర్వహించనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఆయన ఫోన్ ద్వారా స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత నెలలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు గ్రూప్2 శిక్షణ కోసం అర్హత పరీక్షను నిర్వహించామన్నారు. పరీక్షకు 750 మంది హాజరుకాగా ఉచిత శిక్షణకు 350 మంది అర్హత సాధించారని చెప్పారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఏర్పాటు చేసిన తరహాలోనే గ్రూప్ 2 పోటీ పరీక్షలకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక పత్తిమార్కెట్‌లో ప్రారంభించనున్నామన్నారు.  అర్హత సాధించిన 350 మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటలకు పత్తి మార్కెట్ యార్డుకు హాజరు కావాలన్నారు.అర్హత సాధించిన వారంతా శిక్షణకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement