మధ్యాహ్న భోజనంలో మాంసాహారం పెట్టాలి | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో మాంసాహారం పెట్టాలి

Published Thu, Jan 25 2018 7:43 PM

government should provide non veg in mid day meals - Sakshi

గంభీరావుపేట : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మాంసాహారం అందించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ డిమాండ్‌ చేశారు. మండలంలో బుధవారం ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ సమస్యలు పరిష్కరించాలని, వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. ఆదర్శ పాఠశాల సిబ్బందికి 010 పద్దుపై వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మండల అధ్యక్షుడు గంధ్యాడపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శనిగరం మహేశ్, భాస్కర్, నాగరాజు, వెంకటరామారావు, రామచంద్రం పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement