డయేరియాతో పాఠశాల విద్యార్థిని మృతి | Girl Student dies of diarrhea at Hostel | Sakshi
Sakshi News home page

డయేరియాతో పాఠశాల విద్యార్థిని మృతి

Jul 11 2016 8:07 PM | Updated on Sep 4 2017 4:37 AM

జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ముకాడె జ్యోతి(7) డయేరియాతో సోమవారం మృతిచెందింది.

నార్నూర్ (ఆదిలాబాద్) : జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ముకాడె జ్యోతి(7) డయేరియాతో సోమవారం మృతిచెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కెరమెరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన గిరిజన దంపతులు దుర్పతబాయి, చంపత్‌రావుల కూతురు జ్యోతి ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఆమెకు శనివారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. తగ్గకపోవడంతో ఆదివారం ఉదయం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్యం అందించగా.. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. శనివారం రాత్రి వైద్యం అందించి ఉంటే పాప బతికేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆరోపించారు. పాఠశాల వద్ద విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement