నిద్రపోలేదు.. పనిచేస్తున్నా.. | GHMC Officer Viswajith Answer in Twitter | Sakshi
Sakshi News home page

నిద్రపోలేదు.. పనిచేస్తున్నా..

Aug 7 2019 12:32 PM | Updated on Aug 8 2019 12:23 PM

GHMC Officer Viswajith Answer in Twitter - Sakshi

విజయ్‌గోపాల్‌ ట్వీట్‌ ,విశ్వజిత్‌ చేసిన రీ ట్వీట్‌

బంజారాహిల్స్‌: హోటళ్లలో క్యారీ బ్యాగ్‌లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన సరిగ్గా అమలు కావడం లేదంటూ ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ స్పందించారు. బేగంపేట ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ ‘ప్యాకింగ్‌ చార్జి’ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తోందంటూ వినియోగదారుల కోర్టులో కేసు వేసిన సోషల్‌ యాక్టివిస్ట్‌ విజయ్‌గోపాల్‌.. విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. హోటల్‌లో దర్జాగా ప్యాకింగ్‌ చార్జిగా వసూలు చేస్తున్నా ఈవీడీఎం డైరెక్టర్‌ నిద్రపోతున్నారంటూ కామెంట్‌తో విశ్వజిత్‌ను ట్యాగ్‌ చేశారు. ‘మీ పనితీరును గౌరవిస్తున్నా. ఈ విషయాన్ని సంబంధిత విభాగానికి పంపించాను. ప్రక్రియ కొనసాగుతోంది’ అంటూ చెబుతూ తాను నిద్రపోవడం లేదని, పనిచేస్తున్నాని విశ్వజిత్‌ రీట్వీట్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement