‘ఎర్లీబర్డ్‌’ ఆఫర్‌

GHMC Early Bird Offer Starts From Today - Sakshi

నేటి నుంచే అమలు

2019–20 ఆర్థిక సంవత్సరానికి అవకాశం  

ఆస్తిపన్నుపై 5 శాతం రాయితీ  

ఈ నెల 30వ తేదీ వరకు వర్తింపు

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని భవన యజమానులకుశుభవార్త.. ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) ఆస్తిపన్ను ఈనెల 6వ తేదీ నుంచి 30వ తేదీలోగా చెల్లించేవారికి ‘ఎర్లీబర్డ్‌’ పథకం కింద 5 శాతం రాయితీ వర్తిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు.ఇళ్ల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పనిదినాల్లో మీ–సేవ, ఈ–సేవ కేంద్రాల్లో, జీహెచ్‌ఎంసీ సిటిజన్‌సర్వీస్‌ సెంటర్లలో, ఎంపిక చేసిన బ్యాంకుల్లో ఆస్తిపన్ను చెల్లించవచ్చన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేవారు ఎప్పుడైనా చెల్లించవచ్చునని వివరించారు. ఇటీవల ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2018–19)లో ఎర్లీబర్డ్‌ ద్వారా రూ.437.75 కోట్లు వసూలు కాగా, ఈసారి అంతకంటే అధికమొత్తంలో సేకరించాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తాజా ఆర్థిక సంవత్సరానికి(2019–20) మాత్రమే ఎర్లీబర్డ్‌ వర్తిస్తుందని, పాత బకాయిలున్న వారు దీనికి అర్హులు కారని ఆయన స్పష్టం చేశారు. 

ఎర్లీబర్డ్‌ పథకాన్ని 2012–13  ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ఏడాదికేడాదికీ ఈ పథకం ద్వారా చెల్లిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ పథకం ద్వారా వస్తున్న మొత్తం కూడా అధికంగానే ఉంటోంది.

సంవత్సరాల వారీగా ఎర్లీబర్డ్‌వసూళ్లు(రూ.కోట్లలో) ఇలా..
ఆర్థిక సంవత్సరం    వసూలు  
2018–19    437.75  
2017–18    368.30
2016–17    212.00  
2015–16    161.38
2014–15    119.94
2013–14    109.00
2012–13    30.00  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top