బడా కాంప్లెక్స్‌ల అక్రమనల్లాల గుట్టు రట్టు | Fraud Tap Connections in Hyderabad | Sakshi
Sakshi News home page

బడా కాంప్లెక్స్‌ల అక్రమనల్లాల గుట్టు రట్టు

Feb 27 2019 9:43 AM | Updated on Feb 27 2019 9:43 AM

Fraud Tap Connections in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో బడా కాంప్లెక్స్‌లకున్న అక్రమ నల్లాల భాగోతం.. జలమండలి విజిలెన్స్‌ పోలీసుల తనిఖీల్లో రోజుకొకటి చొప్పున బయటపడుతుండడం కలకలం సృష్టిస్తోంది. జలమండలి పైపులైన్‌ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన ఓ బహుళఅంతస్తుల భవన యాజమానిపై విజిలెన్స్‌ పోలీసులు మంగళవారం క్రిమినల్‌ కేసు నమోదు చేశా రు. కేపీహెచ్‌బీ సెక్షన్‌ పరిధిలోని కూకట్‌పల్లి, ధర్మారెడ్డి కాలనీలో ఇంటి నెం.15–31–83/ఎన్‌ఆర్‌ భవనానికి రెండు లక్షలకు పైగా నీటిబిల్లు బకాయిపడడంతో సదరు భవనానికున్న (క్యాన్‌ నెం. 091543800) నల్లా కనెక్షన్‌ను 2017 డిసెంబర్‌ 12న జలమండలి అధికారులు తొలగించారు.  అయినా తిరిగి బోర్డు అధికారు ల అనుమతి లేకుండా తొలగించిన నల్లా కనెక్షన్‌ అక్రమంగా ఏర్పాటు చేసు కున్నారు. దీనిని గుర్తించిన జలమండలి విజిలెన్స్‌ అధికారులు జలమండలి ఎండీ ఆదేశాల మేరకు ఈ నల్లా  కనెక్షన్‌ తొలగించారు. సద రు భవన యజమానిపై కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ  269,430, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జలమండలి విజిలెన్స్‌ విభా గం ఏసీపీ రవిచంద్రారెడ్డి తెలిపారు. జలమండలి అధికారుల అనుమతులు లేకు ండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.

గ్రేటర్‌లో సుమారు లక్ష అక్రమ నల్లాలు..?
మహానగర పరిధిలోని పలు బహుళఅంతస్తుల భవనాలు, కాంప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, పాఠశాలలు, మాల్స్‌లకు అక్రమనల్లాలు సుమారు లక్ష వరకు ఉన్నట్లు జలమండలి వర్గాల్లో బహిరంగ రహస్యమే. అయితే విజిలెన్స్‌ పోలీసులు తనిఖీలు జరిపినప్పుడే ఈ గుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం గమనార్హం. ఈ అక్రమనల్లాల గుట్టు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లైన్‌మెన్లు, మీటర్‌రీడర్లు, మేనేజర్లు, డీజీఎంలకు తెలిసినప్పటికీ ఆయా భవనాల యజమానులతో ఉన్న మామూళ్లబంధం, సత్సంబంధాల కారణంగా అక్రమనల్లాల గుట్టు ను విజిలెన్స్‌ పోలీసులకు చేరవేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.విజిలెన్స్‌ పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సైతం సదరు క్షేత్రస్థాయి అధికారులు విముఖత చూపుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement