కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో శుక్రవారం మధ్యాహ్నం చెరుకు రైతులు రాస్తారోకోకు దిగారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో శుక్రవారం మధ్యాహ్నం చెరకు రైతులు రాస్తారోకోకు దిగారు. రైతుల ఆందోళనతో వట్టివాగు వంతెన జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తమకు వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ రూ.30 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాగా, పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్న డీఎస్పీ రాజేంద్రప్రసాద్.. రైతు సంఘం నాయకుడు మామిడి నారాయణరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు.
(కోరుట్ల రూరల్)