కేసీఆర్‌కు ఆపిల్‌ పండ్లు అందించిన రైతు

Former Give Telangana Apples To CM KCR In Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తొలిసారి పండించిన ఆపిల్‌ పండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కొమురం భీం జిల్లా రైతు కేంద్రె బాలాజీ మంగళవారం ప్రగతి భవన్‌లో అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌కి రైతు బాలాజీ మొక్కను, పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. కొమురం భీం (ఆసిఫాబాద్)జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ ఆపిల్‌ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండడమే ఉదాహరణ అని చెప్పారు. (ఇదిగో తెలంగాణ ఆపిల్‌!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top