‘యురేనియం’ పాయింట్లను మీరే చూపండి

Forest Department letter to Uranium Corporation - Sakshi

యురేనియం కార్పొరేషన్‌కు అటవీశాఖ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి తదుపరి చర్యల విషయంలో సందిగ్ధం నెలకొంది. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా అమ్రాబాద్, ఉడుమిల్ల, నారాయణపూర్‌ల్లోని 4 బ్లాక్‌లలో 83 చ.కి.మీ. పరిధిలో 4 వేల బోర్లు వేసేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర అటవీశాఖకు నెలరోజుల క్రితం అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌(ఏఎండీ) ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలను పరిశీలించి వాస్తవ పరిస్థితులపై నివేదికలు పంపించాలని అచ్చంపేట, దేవరకొండ డివిజన్ల అధికారులకు ఈ ప్రతిపాదనలను మూడువారాల క్రితం అటవీశాఖ పంపింది. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అటవీప్రాంతంలో ఎక్కడెక్కడ యురేనియం నిల్వల వెలికితీతకుగాను 4 వేల బోర్లు వేసి పరీక్షలు జరుతారో యూజర్‌ ఏజెన్సీ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి చూపాలని ఏఎండీకి అటవీశాఖ ఇటీవల లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ బోర్లు వేస్తారన్న దానికి సంబంధించిన మార్కింగ్‌లను చూపిస్తే తమవైపు నుంచి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఏఎండీకి ఈ ప్రాంతాల ఫీల్డ్‌ డైరెక్టర్‌ లేఖ ద్వారా తెలియజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top